• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి: AITUC

GNTR: ఆటో కార్మికుల కోసం ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని AITUC జిల్లా ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తపేటలో జరిగిన ఆటో స్టాండ్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉచిత బస్సు ప్రయాణాల వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లు, ఇప్పుడు సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తూ కష్టపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

March 3, 2026 / 04:09 PM IST

BR నాయుడిపై రోజా ఫైర్..!

CTR: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిపై మాజీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. ఎంతో పవిత్రంగా చూడాల్సిన ఛైర్మన్ పదవిని ఆయన అపహాస్యం చేశారన్నారు. ఆయన ఎప్పుడూ టీటీడీ ఛైర్మన్‌గా వ్యవహరించలేదని మండిపడ్డారు. చంద్రబాబు మెప్పుకోసం ఆయన చేసే పనులన్నీ గొప్పగా చూపడం, వైసీపీ వాళ్లపై తన ఛానల్లో నిందలు వేయడం పరిపాటిగా మారిందన్నారు.

March 3, 2026 / 04:07 PM IST

రుద్రవరం ఆదర్శ పాఠశాలలో ఉత్తమ విద్య

KRNL: రుద్రవరం ఆదర్శ పాఠశాల విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక, సామాజిక సేవా రంగాల్లో ప్రతిభ కనబరిచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిందని ప్రిన్సిపల్ నాగేశ్వరావు తెలిపారు. 2024-25లో విద్యార్థులు 5 ఎంబీబీఎస్, 3 ఐఐఐటీ సీట్లు సాధించారు. NMMS జాతీయ స్కాలర్షిప్‌లో 2024లో 8, 2025లో 4 స్థానాలు దక్కించుకుని జాతీయ స్థాయిలో సత్తా చాటారు.

March 3, 2026 / 04:06 PM IST

ఆచంటలో అంబులెన్స్ ఏర్పాటుకు వినతి

W.G: ఆచంటలో అత్యవసర వైద్య సేవల నిమిత్తం అంబులెన్స్ ఏర్పాటు చేయాలని ఆచంట మండల మానవత సభ్యులు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. మంగళవారం కొమ్ముచిక్కాలలో ఆయన స్వగ్రామంలో కలిసి పలు సమస్యలు విన్నవించారు. ఎమ్మెల్యే పితాని మాట్లాడుతూ.. మానవత ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. అంబులెన్స్ ఏర్పాటుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు.

March 3, 2026 / 04:05 PM IST

అధికారుల సెన్సస్ శిక్షణ ప్రారంభం

TPT: శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ ప్రాంగణంలోని ప్రకాశం భవన్‌లో మార్చి 3 నుండి 5వ తేదీ వరకు నిర్వహించనున్న మూడు రోజుల అధికారుల సెన్సస్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సెన్సస్ ప్రక్రియను ఖచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరాన్ని అధికారులకు వివరించారు.

March 3, 2026 / 04:02 PM IST

తాగునీటి సరఫరాపై మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి సమీక్ష

సత్యసాయి: మడకశిర నియోజకవర్గంలోని 330 గ్రామాలకు శ్రీరామిరెడ్డి పథకం ద్వారా తాగునీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, కాంట్రాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు. ఉద్యోగుల వేతన సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

March 3, 2026 / 04:00 PM IST

ఎల్లో మిర్చి పంటను పరిశీలించిన అధికారి

ప్రకాశం: రాచర్ల మండలం అచ్చంపేటలో ఉద్యానశాఖ అధికారి శ్వేత మంగళవారం ఎల్లో మిర్చి పంటను పరిశీలించారు. ఈ సమయంలో మిర్చి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఎక్కువ శాతం ఎల్లో మిర్చిని కాస్మెటిక్స్ తయారీలో వాడతామని రైతులు చెప్పారు. పంటను గుంటూరు మార్కెట్ యార్డ్‌కు పంపిస్తామని అన్నారు.

March 3, 2026 / 03:59 PM IST

గిద్దలూరులో అంగన్వాడీల నిరసన

ప్రకాశం: గిద్దలూరులో సీడీపీఓ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు మంగళవారం అంగన్వాడీ వర్కర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. వేతనాల పెంపు, సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళన చేపట్టినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు.

March 3, 2026 / 03:55 PM IST

టీడీపీ నేత నుంచి ప్రాణహాని.. కలెక్టర్‌కు వినతిపత్రం

CTR: దిగువ ఎర్రమరాజుపల్లె గ్రామస్తులైన బంగారమ్మ, సౌందర్య, శ్రావణిలు టీడీపీ నేతల నుంచి తమకు ప్రాణహాని ఉందని, న్యాయం చేయాలని కలెక్టర్ వినతిపత్రం అందజేశారు. గత 40 ఏళ్లుగా డీకేటీ భూమి తమ అనుభవంలో ఉందని తెలిపారు. తమకు ఉన్న కొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, స్థానిక టీడీపీ నాయకుడు వెంకటాద్రి రెడ్డి తమ కుటుంబంపై కక్ష పెట్టుకున్నారని ఆరోపించారు.

March 3, 2026 / 03:53 PM IST

స్వామివారి కుంభాభిషేకానికి సీఎం‌కు ఆహ్వానం

GNTR: ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈ నెల 6 నుంచి 8 వరకు జరిగే కుంభాభిషేక మహోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆలయ పాలక మండలి ఆహ్వానించింది. పాలక మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఈవో శీనా నాయక్‌లు క్యాంప్ కార్యాలయంలో సీఎం‌ను కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు.

March 3, 2026 / 03:53 PM IST

గిద్దలూరులో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ

ప్రకాశం: గిద్దలూరు మండలం పొదలకుంటపల్లి గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొని, పట్టాదారు పాసు పుస్తకములను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భూమి హక్కు రైతుల భవిష్యత్తుకు పునాది అని, ప్రభుత్వం ప్రజల ఆస్తి హక్కులను పరిరక్షించేందుకు కట్టుబడి ఉందన్నారు.

March 3, 2026 / 03:52 PM IST

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముప్పిడి

E.G: కొవ్వూరు TDP కార్యాలయంలో కొవ్వూరు, తాళ్లపూడి మండలాలకు చెందిన ముగ్గురు లబ్ధిదారులకు మంజూరైన రూ.1,70,000 విలువ గల CMRF చెక్కులు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మంగళవారం పంపిణీ చేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి CMRF భరోసా కల్పిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టూ మెన్ కమిటీ సభ్యులు కంఠమణి రామకృష్ణ, దాయన రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

March 3, 2026 / 03:37 PM IST

రేపు ఉపాధి హామీ పనులపై ప్రజా వేదిక

SKLM: టెక్కలి మండలం పరిధిలోని 28 గ్రామ పంచాయతీల్లో 01.04.2024 నుంచి 31.03.2025 వరకు అమలైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపై బుధవారం సామాజిక తనిఖీల ప్రజా వేదిక నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎం. రేణుక మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉ.10 కు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.

March 3, 2026 / 03:37 PM IST

‘2027 జనాభా లెక్కలు సమగ్రంగా నిర్వహించాలి’

ప్రకాశం: తర్లుపాడు మండలంలోని కలజువ్వలపాడులో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు పాల్గొన్నారు. 2027 జనాభా లెక్కల సేకరణను ప్రభుత్వ నిబంధనల మేరకు సమగ్రంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. సెన్సెస్ విభాగం అధికారులు జనాభా లెక్కలను డిజిటల్ విధానంలో చేపడుతున్నట్లు తెలిపారు.

March 3, 2026 / 03:37 PM IST

వేసవి తాగునీటి సమస్యపై సర్పంచ్ ఆవేదన

KRNL: పెద్దకడబూరు(మం) పీకలబెట్టలో ఎండాకాలంలో తాగునీటి సమస్య తీవ్రమైందని గ్రామ సర్పంచ్ లక్ష్మి మూకిరెడ్డి తెలిపారు. ఇవాళ ప్రజలకు సొంత నిధులతో తాగునీటి సౌకర్యాలు అందిస్తుంటే, MPDO, అధికారులు సహకారం అందించడంలో విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి కాలంలో ప్రజల కష్టాలను పరిష్కరించడంలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

March 3, 2026 / 03:35 PM IST