»Taxpayers Alert April 30 Is Last Date For These Income Tax Gst Filings
Income Tax: ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ చేశారా? నేడే లాస్ట్
ఆదాయపు పన్ను చెల్లించే వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. సమయానికి ఫైలింగ్స్ చేయని సందర్భంలో భారీ పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్నుకు సంబంధించి గడువును చాలా సార్లు పొడగించుకుంది.
Income Tax: ఆదాయపు పన్ను చెల్లించే వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. సమయానికి ఫైలింగ్స్ చేయని సందర్భంలో భారీ పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్నుకు సంబంధించి గడువును చాలా సార్లు పొడగించుకుంది. ఈ సారి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ చేయడానికి ఆఖరుతేది ఏప్రిల్ 30 చివరి తేదీగా వెల్లడించింది. మీకు బ్యాంకులో భారీగా డబ్బు ఉండి డిపాజిట్ల రూపంలో ఉండి దానిపై ఏడాదికి రూ.40 వేల కంటే ఎక్కువ ఆదాయం వస్తుంటే మీపై బ్యాంకు టీడీఎస్ కట్ చేస్తుంది. అది సీనియర్ సిటిజన్లకు లిమిట్ రూ.50 వేలుగా ఉంది. మీ వార్షిక ఆదాయం ట్యాక్స్ పరిమితికి లోబడి ఉంటే మీరు మీ వడ్డీపై టీడీఎస్ కట్ చేయకుండా చూసుకోవచ్చు. కానీ మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ 15జీ, 15హెచ్ (Filing 15G and 15H ) సమర్పించాల్సి ఉంటుంది. జనవరి నుంచి మార్చి 2023కు సంబంధించి వడ్డీపై టీడీఎస్ కట్ చేయకుండా ఈ ఫామ్స్ సబ్మిట్ చేసేందుకు ఏప్రిల్ 30 చివరి తేదీగా ఉంది.
టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS Payment). అంటే బ్యాంక్ డిపాజిట్ వడ్డీ, ఇంటి అద్దెలు, కన్సల్టేషన్ ఫీ, కమీషన్, క్రిప్టోకరెన్సీ లేదా వర్చువల్ డిజిటల్ అసెట్స్, స్టాంప్ డ్యూటీ, వంటి వాటి ఆదాయ వనరుల నుంచి టీడీఎస్ కట్ చేస్తారు. సాధారణంగా వివిధ ఆదాయాలు, పెట్టుబడులపై టీడీఎస్ రేటు 1 శాతం ఉంటుంది. అయితే క్రిప్టోకరెన్సీలకు మాత్రం ఇది 30 శాతంగా ఉంటుంది. మార్చి నెల టీడీఎస్ పేమెంట్ డ్యూ డేట్ ఏప్రిల్ 30, 2023తో ముగుస్తుంది. అలాగే జీఎస్టీఆర్-4 (GSTR-4) అనేది కంపోజిషన్ స్కీమ్‌ని ఎంచుకునే పన్ను చెల్లింపుదారుల కోసం జీఎస్టీ పాలన కింద రిటర్న్స్‌గా చెబుతారు. గతంలో 2018-19 ఆర్థిక ఏడాది వరకు ఇది మూడు నెలలకు ఓసారి ఫైల్ చేయాల్సి ఉండేది. ఆర్థిక ఏడాది 2022-23కి సంబంధించి వార్షిక జీఎస్టీ-4 రిటర్న్స్ దాఖలు చేసేందుకు చివరి తేదీ ఏప్రిల్ 30, 2023గా ఉంది. ఆ తర్వాత కూడా చెల్లించవచ్చు. ఒక్క రోజుకు రూ.50 చొప్పున రూ.2000 లేట్ ఫీ తో చెల్లించి ఫైల్ చేయవచ్చు.