ఏపీలో కలకలం సృష్టించిన విశాఖ కిడ్నీ రాకెట్ కేసు(Vizag Kidney Rocket Case)ను పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుకు పోలీసులు కొద్ది రోజుల్లోనే ఛేదించారు. విశాఖ కిడ్నీ రాకెట్ కేసు(Vizag Kidney Rocket Case)లో ఓ వైద్యుడు సహా ఆరుగురు దళారులను పోలీసులు అరెస్ట్(6 members Arrest) చేసినట్లు వెల్లడించారు. డాక్టర్ పరమేశ్వరరావు, దళారులు కామరాజు, శ్రీను, శేఖర్, ఎలీనా, కొండమ్మ అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను కిడ్నీ రాకెట్ ముఠా(Kidney Rocket Gang) లక్ష్యంగా చేసుకుంటుందని, ఆ తర్వాత వారికి డబ్బు ఆశ చూపి లేకుంటే మరేవిషయంలోనైనా వారికి సాయం చేస్తున్నట్లు నటించి వారికి దగ్గరవుతారని విశాఖ సీపీ త్రివిక్రమ్ వర్మ(CP Trivikram Varma) తెలిపారు. కొంత కాలం వారితో స్నేహం చేశాక వారి నుంచి కిడ్నీలు వేరు చేసే ప్రక్రియ మొదలవుతుందన్నారు.
విశాఖపట్నంలోని తిరుమల ఆస్పత్రిలోనే కిడ్నీ ఆపరేషన్ల(Kidney Operations) ఎక్కువగా జరిగాయని సీపీ త్రివిక్రమ్ వర్మ(CP Trivikram Varma) వెల్లడించారు. ఈ మధ్యనే 2 ఆపరేషన్లు జరిగినట్లు గుర్తించామన్నారు. వినరు కుమార్, వాసుపల్లి శ్రీనివాస్ రావుకు కిడ్నీ ఆపరేషన్ జరిగినట్లు తెలిపారు. కిడ్నీ ఆపరేషన్ చేసిన వైద్యులపై ఫోకస్ పెట్టామని, వైద్యులు నార్ల వెంకటేశ్వరరావు అందులో కీలక సూత్రధారి అని అన్నారు. ఆయన గతంలో కూడా కిడ్నీ సర్జరీలు చేసి జైలు కూడా వెళ్లాడన్నారు. ఈ కేసు(Vizag Kidney Rocket Case)లో మరింత మందిని అరెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. వారిపై ఐపీసీ 307, 326, 420 కేసులు పెట్టామని సీపీ వెల్లడించారు.