ప్రకాశం: రాచర్ల మండలం పలుగూటి పల్లి గ్రామ సమీపంలోని పొలాల్లో పేకాట ఆడుతున్న ఆరుగురిని SI కోటేశ్వరరావు అదుపులోకి తీసుకున్నారు. కాగా, వారి వద్దనుంచి రూ.13,450 నగదును స్వాధీనం చేసుకున్నట్లు SI తెలిపారు. అనంతరం పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందితే వెంటనే పోలీసులకు 100 ద్వారా తెలియజేయాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.