హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఈనెల 13వ తేదీ నుంచి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను నియంత్రించేందుకు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ.. ప్రమాదాలకు గురికాకుండా ఉండాలన్నారు.