ప్రకాశం: FB పరిచయంతో రూ.1.16 కోట్లను స్వాహా చేసిన ఘటన ప్రకాశం జిల్లా కనిగిరిలో వెలుగుచూసింది. ఓ బైక్ షోరూంకు చెందిన యజమానికి కొద్దిరోజుల క్రితం FBలో ఓ యువతి పరిచయమైంది. తరచూ ఆ యువతి FBలో అతనితో చాటింగ్ చేస్తూ.. అతని ట్రేడింగ్ యాప్ వైపు మొగ్గుచూపేలా చేసి మాయమాటలు చెప్పి రూ.1.16 కోట్లు స్వాహా చేసింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.