BDK: దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న తుమ్మల చెన్నారావుని బుధవారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరామర్శించారు. గత కొన్ని రోజులుగా తుమ్మల చెన్నారావు అనారోగ్యంతో చికిత్స తీసుకుంటున్నారు. తుమ్మల చెన్నారావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.