WWCలో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌కు అనుకూలించని పిచ్‌లతో భారత్ కాస్త ఇబ్బంది పడింది. అయితే, మూడో మ్యాచులో బ్యాటర్లకు పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు. విశాఖలోని ACA-VDCA స్టేడియంలో పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మరింతగా బ్యాటింగ్‌కు అనుకూలించేలా రూపొందించినట్లు సమాచారం. ఇక్కడ భారీ స్కోర్లు నమోదవడం ఖాయం.