TG: మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న ఆయన ఫోరెన్సిక్ నివేదికలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఫోరెన్సిక్ నివేదికతో పాటు అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని తుషార్ మెహతా కోరారు.