CTR: శాంతిపురం మండలం రామాపురం గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు వర్షన్(14) 9వ తరగతి చదువుతున్నాడు. నిన్న ఉదయం టిఫిన్ తీసుకుని వస్తానని చెప్పి AP39MU2606 నంబర్ గల బైకుపై వెళ్లాడు. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాలుడు ఎవరికైనా కనిపిస్తే తమకు 9381880733 నెంబర్ను సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.