జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రగతి విద్యా నిలయంలో పదవ తరగతి వరకు విద్యనభ్యసించిన తీగారం గ్రామానికి చెందిన పోగు శ్రావణి ఎంబిబిఎస్ లో సీటు సాధించింది. ఈ విషయన్ని ప్రగతి విద్యా నిలయం ప్రిన్సిపాల్ వీరమనేని వెంకటేశ్వరరావు బుధవారం తెలియజేశారు. శ్రావణి మిగతా విద్యార్థులకు ప్రేరణగా నిలిచిందని, పాఠశాల స్థాయిలో బోధనలు మెడిసిన్ సాధించేలా తోడ్పాడ్డాయన్నారు.