KDP: బాణసంచా గోడౌన్ల నిర్వాహకులు ఫైర్, భద్రతా నిబంధనలు (సేఫ్టీ మెజర్స్) ఖచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం కడప కలెక్టరేట్లో దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా స్టాళ్ల అనుమతులు, భద్రతా చర్యలు, నిబంధనల పాటింపు, తదితర అంశాలపై జిల్లా ఎస్పీ నచికేత్, డీఆర్వో గంగాధర్ గౌడ్లతో కలసి ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్స్, మండల అధికారులు పాల్గొన్నారు.