బీహార్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకటనలు, విధానపరమైన నిర్ణయాలపై కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని EC స్పష్టం చేసింది. ఎన్నికల ప్రకటన జారీ చేసిన తక్షణమే ఈ కోడ్ అమల్లోకి వచ్చిందని పేర్కొంది. అలాగే, పౌరుల వ్యక్తిగత జీవితాన్ని కచ్చితంగా గౌరవించాలని.. భూములు, భవనాలు, గోడలపై ప్రచారం చేయడాన్ని నిషేధిస్తున్నట్లు ఈసీ తెలిపింది.