TG: మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య వివాదం ముగిసింది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మంత్రుల మధ్య సయోధ్య కుదిర్చారు. ఈ సమావేశంలో మంత్రి అడ్లూరికి పొన్నం క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ‘సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ఛాంపియన్. నాకు పార్టీ సంక్షేమమే ముఖ్యం. నా మాటలను కొందరు వక్రీకరించారు. అడ్లూరికి క్షమాపణలు చెబుతున్నా’ అని పేర్కొన్నారు.