TG: అట్టడుగు సామాజిక వర్గాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ‘జెండా మోసిన నాకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. పార్టీ లైన్ దాటే వ్యక్తిని కాదు. పొన్నం ప్రభాకర్‌ను గౌరవిస్తా.. కానీ, ఆయన వ్యాఖ్యల పట్ల నా మాదిగ జాతి బాధపడింది. పొన్నం క్షమాపణ కోరడంతో ఈ సమస్య ఇంతటితో సమసిపోయింది’ అని పేర్కొన్నారు.