AKP: అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం బాణసంచా కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని హోం మంత్రి వంగలపూడి అనిత బుధవారం ‘X’లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. సహాయక చర్యలపై జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించాలన్నారు.