VZM: ఈనెల 6వ తేదీన సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విజయవాడలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో బాడంగి మండలం ఆకులకట్ట సర్పంచ్ ఉయ్యాల సత్యనారాయణకు అద్భుత ప్రతిభ కనబరిచినందుకు అవార్డు లభించింది. ఈ సందర్భంగా బుధవారం బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన ఆయనను సన్మానించారు.