GNTR: ఫిరంగిపురంలో పాఠశాల విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ ఆటోలో బుధవారం అత్యంత ప్రమాదకర ప్రయాణం దృశ్యం కనిపించింది. ఆటో వెనుక భాగంలో విద్యార్థుల బ్యాగులను పేర్చి, వాటిపై ముగ్గురు విద్యార్థులు నిలబడి ప్రయాణం చేశారు. ఈ రకంగా ప్రయాణించడం ఎంత ప్రమాదకరమో తెలిసినా, ఈ నిర్లక్ష్యం చూసి పలువురు విమర్శలు గుప్పించారు.