టాటా గ్రూప్ బోర్డు నియామకాలు, పాలనాంశాల విషయంలో ట్రస్టీల మధ్య ఏర్పడిన వివాదంపై కేంద్రం స్పందించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టాటా గ్రూప్ ముఖ్యులతో భేటీ అయ్యారు. ఈ వివాదాన్ని బయటి జోక్యం లేకుండా అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని వారికి కేంద్ర ప్రభుత్వం సలహా ఇచ్చినట్లు సమాచారం.