NLR: విజయవాడ నుంచి కడపకు వెళ్తున్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీశ్ కుమార్ రెడ్డిని ఇవాళ మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో ఉదయగిరి ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా, పూలమాలతో సన్మానించారు. జిల్లా, నియోజకవర్గాలలో రాజకీయ స్థితిగతులు, రానున్న స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షించారు.