CTR: జీడీనెల్లూరు ఎమ్మెల్యే వీఎం థామస్ పల్లెనిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎస్ఆర్ పురం మండలంలోని కమ్మకండ్రిగ గ్రామంలో ఇవాళ పల్లెనిద్ర చేయనున్నారు. కాగా, గ్రామ సభ ఏర్పాటు చేసి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షిస్తారు. అనంతరం రాత్రి 7 గంటలకు కార్యక్రమం మొదలవుతుందని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది.