SKLM: శ్రీకాకుళం పట్టణం శాంతినగర్‌కాలనీ సమీపంలోని నెహ్రూ నగర్ వద్ద సెల్ టవర్ నిర్మాణానికి కంపెనీ ప్రతినిధులు పూనుకోవడంతో బుధవారం స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. జనావాసాల నడుమ సెల్‌టవర్ నిర్మాణం జరిపితే రేడియేషన్ ప్రభావంతో అనారోగ్యానికి లోనవుతామంటూ ఆవేదన చెందారు. సెల్‌టవర్ నిర్మాణంతో అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు.