BPT: చీరాల పట్టణంలోని విఠల్ నగర్లో బుధవారం వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఆరుబయట ఆడుకుంటున్న ఒక బాలుడిపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. కుక్కలు కరవడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను తరిమివేశారు. గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.