WGL: వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన ఇల్లంద మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్యాల దేవేందర్ కుమారుడు మల్యాల సంతోష్ అనారోగ్యంతో మరణించారు. బుధవారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఎద్దు సత్యనారాయణ, రవి, దిలీప్ ఉన్నారు.