SKLM: గార మండలంలోని శ్రీకూర్మంలో కొలువైయున్న శ్రీ కూర్మనాథ స్వామిని బుధవారం ఉదయం గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజు దర్శించుకున్నారు. అనంతరం ఆయన రాకతో ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. శ్రీ కూర్మ నాథుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. అనంతరం తీర్ధ ప్రసాదాలను ఆలయ సిబ్బంది, అర్చకులు అందజేశారు.