AKP: గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడు ప్రగడ గణేష్‌కు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష రూ.1,00,000 జరిమానా విధించినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా బుధవారం తెలిపారు. 2015 నవంబర్‌లో చోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 100 కేజీలు గంజాయి రవాణా చేస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి చార్జ్ షీట్ దాఖలు చేయగా నేరం రుజువైందన్నారు. చోడవరం కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.