VKB: దోమ మండల కేంద్రంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా శాఖలో సరైన సిబ్బంది లేకపోవడంతో ప్రజలు గంటల తరబడి క్యూలైన్లో నిలబడుతున్నారు. రోజంతా నిలబడిన పని అవుతుందన్న నమ్మకం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు సభ్యులతో బ్యాంక్‌ను నడుపుతున్న మేనేజర్ స్పందించి సిబ్బందిని పెంచి ప్రజల అవసరాలకు అనుగుణంగా విధులను నిర్వహించాలని కోరుతున్నారు.