ఛత్తీస్‌గఢ్ సక్తి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ కూలి నలుగురు కూలీలు మృతిచెందగా.. ఆరుగురు గాయపడ్డారు. దబ్రా ప్రాంతంలోని ఉచ్చపిండా గ్రామంలోని ఆర్కేఎం పవర్ జెన్ ప్లాంట్‌లో ఈ ఘటన జరిగింది. 10 మంది కార్మికులు షిఫ్ట్ ముగించుకుని లిఫ్ట్‌లో దిగుతుండగా లిప్ట్ అకస్మాత్తుగా కింద పడిపోయిందని సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.