PLD: వెల్దుర్తి మండలం గుండ్లపాడు జంట హత్యల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి సోదరులు నేడు విచారణకు హాజరుకావాలని మాచర్ల రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీరికి సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు నేటితో ముగియనుండటంతో, కేసు పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.