AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. సముద్ర జలాలు కాలుష్యం అవుతున్నాయంటూ మత్స్యకారులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సముద్రంలో ప్రయాణించి పవన్ పరిశీలించనున్నారు. అలాగే, పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.