GNTR: ఆశా వర్కర్స్కు నెలకు రూ.26,000 కనీస వేతనం అమలు చేయాలని, అన్ని రకాల సెలవులు ఇవ్వాలని యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరులోని అర్బన్ హెల్త్ సెంటర్ల వద్ద ఆశా వర్కర్స్ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆరేళ్లుగా జీతాలు పెరగలేదన్నారు. 5G ఫోన్లు ఇవ్వాలని, చనిపోయిన వారికి రూ.20,000 మట్టి ఖర్చుల కోసం ఇవ్వాలని కోరారు.