VSP: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. జగన్ అబద్దాల స్టోరీలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలను అడ్డుకుంటున్న వ్యక్తి జగన్ రెడ్డి అని పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు.