H-1B వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ US అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఎన్విడియా సీఈఓ హువాంగ్ సమర్థించారు. ఫీజుల పెంపును పట్టించుకోకుండా తమ కంపెనీ వీసాల స్పాన్సరింగ్ను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ‘ప్రపంచ దేశాల నుంచి వలస వచ్చిన ప్రతిభావంతులే ఎన్విడియాను తీర్చిదిద్దారు. అందుకే మేము ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులను తీసుకొస్తాం’ అని తెలిపారు.