MHBD: గంగారం మండలం కొడిసెల మిట్ట ప్రాథమిక పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం హెడ్మాస్టర్ పి. సరితకు పాము కాటు వేసిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే గమనించి, ఆమెను చికిత్స కోసం గంగారం ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఇవాళ గ్రామస్థులు తెలిపారు. అధికారులు పాఠశాల పరిసరాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.