NTR: 97% మేర పూర్తైన పశ్చిమ బైపాస్ పనులకు అపరిష్కృతంగా ఉన్న టవర్ల సమస్య ఆటంకంగా మారింది. రహదారి వెళ్లే మార్గంలోని హైటెన్షన్ ట్రాన్స్మిషన్ టవర్ల ఎత్తు పెంచితే మిగతా పనులు పూర్తి కానుండగా.. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు పెండింగ్లో ఉన్నాయి. ఈ అనుమతులు వస్తే మిగతా పనులు పూర్తై రహదారి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది.