NZB: ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన మాణిక్వాడ్ లాలేష్ అనే యువకుడు ఇటీవల డయల్ 100కు పదేపదే కాల్స్ చేసి పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడు. అతనిపై న్యూసెన్స్ కేసు నమోదు చేసి, మంగళవారం ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చారు. జడ్జి గట్టు గంగాధర్ విచారణ అనంతరం నిందితుడికి రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు SHO సత్యనారాయణ గౌడ్ బుధవారం తెలిపారు.