ATP: కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని వడ్డే కాలనీలో జరుగుతున్న గ్రామదేవత తుమ్మల మారెమ్మ జాతరలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు కాలనీ ప్రజలు, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన జాతరలో ఉత్సాహంగా పాల్గొని గ్రామదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.