ప్రముఖ నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా దర్శకుడు కీర్తిశ్వరన్ తెరకెక్కించిన సినిమా ‘డ్యూడ్’. అక్టోబర్ 17న రిలీజ్ కానున్న ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. దీనికి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. 2:20 గంటల నిడివితో ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. అంతేకాదు దీని ట్రైలర్ రేపు రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో ప్రదీప్ సరసన మమితా బైజు నటించింది.