SRPT: అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే జైలు శిక్ష తప్పదని పట్టణ సీఐ వెంకట్ అన్నారు. సూర్యాపేటలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న నలుగురు ఆర్ఎంపీలను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు మంగళవారం రాత్రి తెలిపారు. వారి నుంచి స్కానింగ్ మిషన్, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.