సినీనటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ నివాసాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలకు సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. భూటాన్ ఆర్మీ తన వాహనశ్రేణిలోని కొన్ని ఖరీదైన వాహనాలను ఉపసంహరించుకుంది. వాటిని కొందరు ఏజెంట్లు వేలంలో అతితక్కువ ధరకు దక్కించుకున్నారు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఇండియాకు స్మగ్లింగ్ చేశారని సమాచారం.