NLG: అనుముల మండలం హాలియాలోని ఎస్బీఐ బ్యాంకులో అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒక కంప్యూటర్తో పాటు కొన్ని డాక్యుమెంట్లు పూర్తిగా కాలిపోయాయి. బ్యాంకు అపార్ట్మెంట్ కింద ఉండడంతో నివాసితులు ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తూ పెను ప్రమాదం జరగకపోవడంతో బ్యాంక్ అధికారులు అపార్ట్మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.