NZB: సాలూర మండలంలోని మందన్న గ్రామం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను మంగళవారం రాత్రి సాలూరు శివారులో ఎమ్మార్వో శశిభూషణ్ పట్టుకున్నారు. ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా ఉంటామని ఆయన నేడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడితే ఎవరినైనా ఉపేక్షించేది లేదని, కఠినంగా చర్యలు తీసుకుంటామని MRO హెచ్చరించారు.