KMM: రైలులో ప్రయాణిస్తున్న తమిళనాడుకు చెందిన వ్యక్తి మంగళవారం ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. చెన్నైకి చెందిన గోపీనాధ్ (41) బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వచ్చి కూలీ పని చేస్తున్నాడు. కుటుంబీకులను చూడడానికి చార్మినార్ ఎక్స్ప్రెస్లో బయలుదేరగా, ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్ వెనక భాగంలో ప్రమాదవశాత్తు జారి పడగా తీవ్రగాయాలతో మృతిచెందాడు.