SKLM: ప్రతీ కార్పొరేషన్ ఆర్థిక వ్యవహారాలు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సూచించారు. బుధవారం అమరావతిలో పీయూసీ పరిధిలోని వివిధ కార్పొరేషన్ల వార్షిక ఆదాయ–వ్యయాలు, పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందించాలని ఆయన అధికారులకు ఆదేశించారు.