ADB: రూరల్ మండలంలోని జాతీయ రహదారి 44 పై భీంసరి బ్రిడ్జి వద్ద బుదవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి నాగపూర్‌కు వెళ్తున్న వర్మ అనే ప్రైవేట్ ట్రావెల్ బస్సును వెనక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా వారిని 108 అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించారు.