NZB: కమ్మర్ పల్లీ మండలం హసకొత్తూర్ గ్రామానికి చెందిన పూజారి మౌనిక అనే మహిళ ఇంట్లో గుడుంబా విక్రయిస్తుండగా, ఎక్సైజ్ ఎస్సై మానస పట్టుకున్నారు. ఈ కేసులో ఆర్మూర్ ప్రథమ శ్రేణి న్యాయస్థానం నిందితురాలికి ఏడాది జైలు శిక్షతో పాటు, రూ.10వేలు జరిమానా విధించింది. న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.