BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) ఆధ్వర్యంలో పంట నమోదు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా AEO గ్రామ రైతుల నుండి పంట వివరాలను సేకరించి నమోదు చేశారు. ఇంకా నమోదు చేసుకోని రైతులు పట్టా పాస్ బుక్‌తో వచ్చి పంట వివరాలు నమోదు చేసుకోవాలని AEO కోరారు. కార్యక్రమంలో స్థానిక రైతులు ఉన్నారు.