AP: జగన్ రాజకీయ లబ్ది కోసమే విశాఖ, అనకాపల్లిలో పర్యటిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. పర్యటన కోసం రావడంలో తప్పు లేదు కానీ, జనసమీకరణ చేసి గొడవలు పెట్టడం మంచిది కాదన్నారు. లక్షమందితో రోడ్లపై నడుస్తామంటే సరికాదన్నారు. తాము ఎవరినీ అడ్డుకోవడం లేదని తెలిపారు. నిబంధనల ప్రకారం తాము వ్యవహరిస్తున్నట్లు వెల్లడించారు.