NDL: కొలిమిగుండ్ల మండలంలోని తుమ్మలపెంట గ్రామానికి చెందిన మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామానికి చెందిన సావిత్రి (27) కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సీఐ రమేష్ బాబు ఇవాళ వెల్లడించారు. సావిత్రిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.