E.G: రాజమండ్రికి చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నేతల రామచంద్రరావు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సమాచారం తెలుసుకున్న నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ బుధవారం రామచంద్రరావు నివాసానికి వెళ్ళి వారి పార్థివ దేహానికి పూల మాల వేసి, ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.